Arvind Kejriwal : వీడియోల లీక్ పై సీఎం సీరియస్
విద్యార్థినులు సంయమనం పాటించాలి
Arvind Kejriwal : పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం రేపింది. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది.
విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇదే సమయంలో వీడియోలు లీక్ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిల ధైర్యాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారని, ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారని ఈ విషయంపై తాను సీఎం భగవంత్ మాన్ తో మాట్లాడానని చెప్పారు.
ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. యూనివర్శిటీలో బాలికల వీడియోలు లీక్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది.
ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. దోషులందరికీ కఠిన శిక్ష పడుతుందన్నారు. ఇలాంటివి జరగడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు.
తామంతా మీ వెంట ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ విపత్కర సమయంలో ఓపికతో ఉండాలని సూచించారు. అంతకు ముందు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో తిసినట్లు ఆరోపణలున్నాయి.
ఆ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో కలకలం రేగింది. ఆమె ఆ వీడియోలను సిమ్లాలోని ఓ అబ్బాయికి పంపిందని , అతడు వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడని గుర్తించారు.
Also Read : బాలిక వీడియోలు లీక్ పై నిరసన