Rahul Gandhi Help : చిన్నారికి పాద‌ర‌క్ష‌లు తొడిగిన రాహుల్

సోష‌ల్ మీడియాలో వీడియో హ‌ల్ చ‌ల్

Rahul Gandhi Help :  భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. త‌మిళ‌నాడులో ప్రారంభ‌మైన ఈ యాత్ర ఇప్పుడు కేర‌ళ‌ల‌లో కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీకి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది పెద్ద ఎత్తున‌. ఇదే క్ర‌మంలో యువ‌తీ యువ‌కులు, చిన్నారులు రాహుల్ గాంధీని చూసేందుకు, క‌లిసేందుకు పోటీ ప‌డుతున్నారు.

తాజాగా యాత్ర సంద‌ర్భంగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఆదివారం ఉద‌యం అల‌ప్పుజా జిల్లాలోని హ‌రిపాడ్ నుంచి పాద‌యాత్ర ప్రారంఢ‌మైంది.

ఇవాల్టితో 11వ రోజుకు చేరుకుఇంది. 13 కిలోమీట‌ర్ల మేర సాగిన పాద‌యాత్ర‌లో సీనియ‌ర్ నేత‌లు ర‌మేష్ చెన్నితాల‌, కే. ముర‌ళీధ‌ర‌న్ , కొడికున్నిల్ సురేష్‌, కేసీ వేణుగోపాల్ , కేర‌ళ‌లో శాస‌న‌స‌భా ప‌క్ష నేత స‌తీష‌న్ లు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.

ర‌హ‌దారికి ఇరు వైపులా వేచి ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు రాహుల్ భ‌ద్ర‌తా వ‌ల‌యాన్ని ఛేదించారు. అంబ‌ల‌ప్పుజా ప‌ట్ట‌ణంలో యాత్ర కొన‌సాగుతుండ‌గా ఓ చిన్నారి రాహుల్ గాంధీని అనుస‌రించింది.

త‌న పాద‌ర‌క్ష‌ల‌ను ధ‌రించేందుకు నానా తంటాలు ప‌డింది. ఆ చిన్నారి ఇబ్బందిని గ‌మ‌నించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi Help) పాద‌ర‌క్ష‌ల‌ను ధ‌రించేందుకు స‌హాయం చేశారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఎంతో ఉన్న‌త ప‌ద‌విలో ఉన్నా ఎలాంటి భేష‌జం లేకుండా గొప్ప మ‌న‌సు చాటుకున్న రాహుల్ గాంధీని ప‌లువురు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

ఇక ఈ యాత్ర కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది 150 రోజుల పాటు.

Also Read : కొలీజియం వ్య‌వ‌స్థ‌పై పున‌రాలోచించాలి

Leave A Reply

Your Email Id will not be published!