NIA Raids : ఏపీ..తెలంగాణ రాష్ట్రాలలో ఎన్ఐఏ దాడులు
కర్నూలు..నంద్యాల..నెల్లూరు..నిజామాబాద్
NIA Raids : ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ కల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ , దేశ వ్యతిరేక శక్తుల పని పట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ(NIA Raids) రంగంలోకి దిగింది.
ఇటీవల అస్సాంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంది. ఆదివారం ఊహించని రీతిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సోదాలు చేపట్టడం కలకలం రేపుతోంది.
ఏపీలోని కర్నూలు, నెల్లూరు, నంద్యాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలలో ఈ కేసులో నిందితులు, అనుమానితులతో సంబంధాలు ఉన్న వారిని గుర్తించి దాడులు నిర్వహించారు.
ఇదిలా ఉండగా గత నెలలో 27 మందిపై హైదరాబాద్ లో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దేశ వ్యారేక కార్యకలాపాలకు పాల్పడిందన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇవాళ విస్తృతంగా తనిఖీలు, దాడులు(NIA Raids) చేపట్టింది.
కేంద్ర సర్కార్ పై యుద్దం చేయడం, దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అల్లర్లకు, కుట్రలకు తెర లేపడం వీరి పని అని ఎన్ఐఏ ఇప్పటికే పేర్కొంది. నేరపూరిత కుట్రను అనుసరించి వారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులను నియమించారు.
ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు శిక్షణ ఇవ్వడం కోసం శిబిరాలు నిర్వహించారు. వారు చట్ట విరుద్దమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారంటూ ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
కరాటే తరగతుల పేరుతో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారంటూ ఆరోపించింది.
Also Read : దళితబంధు తరహాలో గిరిజనబంధు