Raghav Chadha : గుజ‌రాత్ ఆప్ ఇన్ ఛార్జ్ గా రాఘ‌వ్ చ‌ద్దా

సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించిన ఆప్ చీఫ్

Raghav Chadha :  పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ఆప్ ఎంపీ రాఘ‌వ్ చద్దాకు కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఆయ‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన నాయ‌కుడిగా రాఘ‌వ్ చ‌ద్దా పేరొందారు.

క్లీన్ ఇమేజ్ క‌లిగి ఉన్న స‌ద‌రు నాయకుడు ఇటీవ‌ల పంజాబ్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చార , వ్యూహాత్మ‌క బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు.

దీంతో ఊహించ‌ని రీతిలో పంజాబ్ లో చరిత్రాత్మ‌క‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసింది ఆప్. భ‌గ‌వంత్ మాన్ సీఎంగా కొలువు తీరారు. ఇదే స‌మ‌యంలో పంజాబ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించింది రాఘ‌వ్ చ‌ద్దాకు(Raghav Chadha) .

ఆయ‌న‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించింది. ఇప్ప‌టికే దేశంలో పంజాబ్, ఢిల్లీలో ఆప్ కొలువు తీరింది. గుజ‌రాత్ లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే ప‌లుమార్లు ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) రాష్ట్రాన్ని సంద‌ర్శించారు. విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. గ‌త 27

ఏళ్లుగా ఇక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లో ఉంది.

ఈ ఒక్క‌సారి త‌మ‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు ఆప్ చీఫ్. ఇదే స‌మ‌యంలో పంజాబ్ లో ఆప్ ప‌వ‌ర్ లోకి రావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన రాఘ‌వ్ చ‌ద్దాకు గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్ర ఇన్ చార్జ్ గా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ఆదివారం నిర్ణ‌యం తీసుకున్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదిలా ఉండ‌గా ఆమ్ ఆద్మీ పార్టీలో కీల‌క‌మైన నేత‌గానే కాకుండా రాఘ‌వ్ చ‌ద్దా మేధావుల జాబితాలో ఉన్నారు.

Also Read : ఓట‌మి భ‌యంతోనే ఆప్ పై దాడులు

Leave A Reply

Your Email Id will not be published!