Sushil Modi : నితీశ్ ఎక్కడ పోటీ చేసినా ఓటమి ఖాయం
మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ
Sushil Modi : బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(Sushil Modi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన గతంలో జేడీయూలో ఉన్నారు. నితీశ్ కుమార్ ను వీడి బీజేపీ పంచన చేరారు.
ఇటీవల 17 ఏళ్ల పాటు బీజేపీతో కొనసాగిస్తూ వచ్చిన బంధాన్ని తెంచేశారు నితీశ్ కుమార్. ఆయన ప్రతిపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అంతే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీఎం సీనియర్ నాయకుడు సీతారం ఏచూరి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు.
అనంతరం తనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో సమావేశం కావడం కలకలం రేపింది.
ఈ తరుణంలో జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నితీశ్ కుమార్(Nitish Kumar) కు మద్దతు పలికారు సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.
ఆయనకు యూపీలోని పూల్ పూర్ నుంచి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చారు. దీనిపై ఆదివారం స్పందించారు సుశీల్ కుమార్ మోదీ. నితీశ్ కుమార్ కు అంత సీన్ లేదన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా నితీశ్ కుమార్ పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయనకు డిపాజిట్లు రావని జోష్యం చెప్పారు. సమాజ్ వాది పార్టీకే అభ్యర్థులు లేకుండా పోయారని ఇక నితీశ్ వెళ్లి ఏం చేస్తాడంటూ ఎద్దేవా చేశారు మోదీ.
Also Read : చిరుతల పేరుతో మోదీ రాజకీయం