Chandigarh University Row : 60 వీడియోలు షేర్ చేయలేదు
ప్రకటించిన చండీగఢ్ యూనివర్శిటీ
Chandigarh University Row : పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్శిటీలో ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. యూనివర్శిటీకి చెందిన బాలికలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు రోడ్డెక్కారు.
నిన్న రాత్రి నుంచి ఇంకా నిరసన కొనసాగుతూనే ఉన్నది. ఇదే యూనివర్శిటీకి(Chandigarh University Row) చెందిన ఓ స్టూడెంట్ తన బాయ్ ఫ్రెండ్ కు వీడియోలు షేర్ చేసిందని, వాటిని సదరు వ్యక్తి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడనేది ప్రధాన ఆరోపణ.
దీనికి సంబంధించి ఇప్పటికే విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు చేశారు, ఎలా వెళ్లాయనే దానిపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్(CM Bhagwant Mann).
మరో వైపు విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చండీగఢ్ యూనివర్శిటీ స్పందించింది.
60 వీడియోలు షేర్ చేశారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. నిందితురాలు తన వీడియోను ఫ్రెండ్ తో పంచుకున్నది మాత్రం వాస్తవమని పేర్కొంది.
కాగా మిగతా విద్యార్థినులకు సంబంధించిన వీడియోలను షేర్ చేయలేదని తెలిపింది. విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కోసం పోలీసులను ఆశ్రయించారని వెల్లడించింది.
అయితే దర్యాప్తులో తన వీడియో తప్ప ఇతరుల వీడియోలు పంచుకోలేదని తేలిందని పేర్కొన్నారు చండీగఢ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్. ఎస్ . బావా. అయితే షేర్ చేసిన వీడియోను డిలీట్ చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా కొంత మంది స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : చండీగఢ్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ