Arvind Kejriwal : ఓట‌మి భ‌యంతోనే ఆప్ పై దాడులు

మోదీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి మోదీపై నిప్పులు చెరిగారు. గుజ‌రాత్ లో రాబోయే ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓట‌మి చెందడం ఖాయ‌మ‌న్నారు.

ఈ భ‌యంతోనే మోదీ నేతృత్వంలోని కేంద్రం , ఆయ‌న ప‌రివారం ఆప్ ను అణిచి వేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. గుజ‌రాత్ రాష్ట్రంలో 27 ఏళ్లుగా ప‌రిపాలిస్తున్న బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌న్నారు.

రోజు రోజుకు ఆప్ కు అనూహ్య‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని ప్ర‌జ‌ల నుంచి అన్నారు అర‌వింద్ కేజ్రీవాల్. దీంతో త‌ట్టుకోలేక కేంద్రం త‌మ పార్టీకి చెందిన మంత్రుల‌ను, నేత‌ల‌ను త‌ప్పుడు అవినీతి కేసుల్లో ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

గుజ‌రాత్ లో ఈసారి ఆప్ స‌ర్కార్ ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌న్నారు. త‌మ‌కు కాంగ్రెస్ పార్టీ పోటీ కాద‌న్నారు. త‌మ‌కు పోటీ తామేన‌ని ప్ర‌క‌టించారు

కేజ్రీవాల్. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు.

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పెరుగుతున్న ఆప్ ప్ర‌భావంతో బీజేపీ ఎంత‌గా విసిగి పోయిందంటే ప్ర‌ధాని స‌ల‌హాదారు హిరేన్ జోషి ఆప్ కు క‌వ‌రేజి ఇవ్వ‌వ‌ద్దంటూ ఆదేశాలు జారీ చేశార‌ని ఆరోపించారు.

గుజ‌రాత్ లోని ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ళ్ల‌ను బెదిరింపుల‌కు గురి చేశారంటూ మండిప‌డ్డారు. ఆయా చాన‌ళ్ల , ప‌త్రిక‌ల య‌జ‌మానులు, సంపాద‌కుల‌ను వార్నింగ్ కూడా ఇచ్చారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

ఈ సంద‌ర్భంగా పీఎం స‌ల‌హాదారుకు సూచ‌న చేశారు. ఇలా చేయ‌డం మానేయ‌మ‌ని కోరారు. జోషి సందేశాల స్క్రీన్ షాట్స్ ను పంచుకుంటే పీఎం, ఆయ‌న స‌ల‌హాదారు త‌మ ముఖాల‌ను దేశానికి చూపించు కోలేర‌ని ఎద్దేవా చేశారు.

Also Read : గుజ‌రాత్ ఆప్ ఇన్ ఛార్జ్ గా రాఘ‌వ్ చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!