P Chidambaram : కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అవసరం
ఆయన మనసు మార్చుకుంటారు
P Chidambaram : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అక్టోబర్ లో పార్టీ చీఫ్ కోసం ఎన్నిక జరగనుంది.
ఈ తరుణంలో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి బరిలో ఉండేందుకు నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆదివారం చిదంబరం స్పందించారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చీఫ్ కాక పోయినా లేదా బరిలో నిలిచినా నిలవక పోయినా రాహుల్ గాంధీ కీలకమైన నాయకుడిగా ఉంటారని స్పష్టం చేశారు.
కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇది పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు చిదంబరం(P Chidambaram) . కాగా రాహుల్ గాంధీ మనసు మార్చు కోవచ్చని తెలిపారు.
అయితే పార్టీ ఎన్నికల పారదర్శకతపై వివాదాలకు తావు లేదన్నారు.ఏఐసీసీ చీఫ్ పదవికి ఏకాభిప్రాయానికి మొగ్గు చూపారు. రాహుల్ స్థానానికి ఢోకా లేదన్నారు.
ఆయన స్థానం పదిలంగా ఉందన్నారు. జాతీయ మీడియా సంస్థ పీటీఐతో చిదంబరం మాట్లాడారు. కొంత మంది నాయకులు అనుమానం వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని, వాటన్నింటికీ పూర్తి సమాధానం ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఇచ్చారన్నారు.
ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించిన జాబితాను తమ పార్టీ ఇప్పటికే ప్రకటించిందని కానీ ఈ పద్దతి, సంప్రదాయం ఏ పార్టీలో లేదన్నారు చిదంబరం.
పూర్తి ప్రజాస్వామ్యం ఒక్క తమ పార్టీలో ఉందన్నారు మాజీ కేంద్ర మంత్రి. బీజేపీ లేదా మరేదైనా పార్టీ తమ పార్టీ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఇలాంటి అంశాలను ఎవరైనా లేవనెత్తారా అని చిదంబరం ప్రశ్నించారు.
ఏకాభిప్రాయం ద్వారా ఎన్నుకుంటే బెటర్ అన్నారు.
Also Read : చిన్నారికి పాదరక్షలు తొడిగిన రాహుల్