CM Bommai : కేరళ రైలు ప్రతిపాదనలు తిరస్కరణ
వద్దన కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై
CM Bommai : కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన రైలు ప్రతిపాదనలను కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai) తిరస్కరించారు. కేరళ సర్కార్ కన్హంగాడ్ – కానియూర్ రైలు మార్గం, ఇతర హై ప్రాజెక్టులతో సహా వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి సహకారం కోరింది.
ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు కేరళ సీఎం పినయర్ విజయన్ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు సీఎం. ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పర్యావరణ సున్నిత ప్రాంతాలు, వన్య ప్రాణుల అభయారణ్యాలలో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టడం సాధ్యం కాదని కేరళ సీఎంకు స్పష్టం చేశారు బొమ్మై.
ఆదివారం కేరళ సెం పినరయి విజయన్ ను అధికారిక నివాసంలో కలిశార. ఈ సందర్బంగా సీఎం మీడియాతో మాట్లాడారు. దక్షిణ ప్రాంత కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు విజయన్ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు బొమ్మై.
ప్రతిపాదిత కన్హంగాడ్ – కానియూర్ రైలు మార్గం ప్రాజెక్టు కేరళలో 40 కిలోమీటర్లు , కర్ణాటకలో 31 కిలోమీటర్లుగా ఉందన్నారు. కాగా ఈ ప్రాజెక్టు కర్ణాటకకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు బొమ్మై(CM Bommai).
అంతే కాకుండా పశ్చిమ కనుమలలోని జీవ వైవిధ్యం, పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాల ద్వారా వెళుతుందని చెప్పారు సీఎం. అందుకే ఈ ప్రాజెక్టుకు కర్ణాటక రాష్ట్రం విస్తృత సహకారం అందించడం సాధ్యం కాదని కేరళ సీఎంకు స్పష్టంగా చెప్పామన్నారు బొమ్మై.
తెలిచేరి- మైసూర్ రైల్వే లైన్ పాత ప్రాజెక్టుపై కూడా చర్చించారని చెప్పారు. ప్రతిపాదిత రైలు మార్గం బందీపూర్ , నాగర్ హూళే జాతీయ ఉద్యానవనాల ద్వారా వెళ్లే అవకాశం ఉందని అనుమతి ఇవ్వడం సాధ్యం కాదన్నారు బొమ్మై.
Also Read : కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అవసరం