Kerala Governor : కేరళ సీఎంపై గ‌వ‌ర్న‌ర్ ఖాన్ క‌న్నెర్ర‌

క‌న్నూర్ యూనివ‌ర్శిటీ వివాదం

Kerala Governor : క‌న్నూర్ యూనివ‌ర్శిటీపై వివాదం మ‌ధ్య కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తాజా అభియోగం మోపారు. 2019లో క‌న్నూర్ యూనివ‌ర్శిటీలో త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ప్పుడు కేసు పెట్ట‌వ‌ద్దంటూ పోలీసుల‌ను సీఎం ఆదేశించారని ఆరోపించారు.

వామ‌ప‌క్ష స‌ర్కార్ పై, సీఎం విజ‌య‌న్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు గ‌వ‌ర్న‌ర్ ఖాన్. ఈ చ‌ర్య బాధ్యుల ప‌ట్ల అనుకూల‌త‌ను చూపుతుందా లేదా దాడి చేసేందుకు ఆరోపించిన కుట్ర‌లో భాగమా అనేది నిర్ధారించాల్సి ఉంద‌న్నారు ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్(Kerala Governor).

దానిపై దర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు గ‌వ‌ర్న‌ర్. కేర‌ళ‌లోని అలువాలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హోం డిపార్ట్మెంట్ ఇన్ చార్జి , సీఎం రిపోర్ట్ చేయ‌వ‌ద్ద‌ని నిర్దిష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పోలీసుల‌కు స్ప‌ష్టంగా చెప్పార‌న్నారు ఖాన్. ఇది ఐపీసీ ప్ర‌కారం గుర్తించ‌ద‌గిన నేర‌మ‌ని స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్. భార‌త రాష్ట్ర‌ప‌తి లేదా గ‌వ‌ర్న‌ర్ త‌మ విధుల‌ను నిర్వ‌ర్తించ‌కుండా ఎవ‌రైనా బెదిరించ‌డం లేదా అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తే అది ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డ‌నుంద‌న్నారు.

జ‌రిమానాతో కూడిన శిక్షార్హ‌మైన నేర‌మ‌ని ఐపీసీ స్ప‌ష్టంగా చెబుతుంద‌న్నారు. ఇప్పుడు ఇది కుట్ర కాదా లేదా మ‌న‌కు ప్ర‌తి చోటా క‌నిపించే అభిమాన‌మా అని తెలుసుకునేందుకు ప్ర‌జ‌ల‌కు, మీడియాకు వ‌దిలి వేస్తున్నానంటూ చెప్పారు గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్(Kerala Governor).

కాగా గ‌వ‌ర్న‌ర్ చేసిన కామెంట్స్ పై ఇంకా స్పందించ లేదు సీఎం విజ‌య‌న్.

Also Read : కేర‌ళ రైలు ప్ర‌తిపాద‌న‌లు తిరస్క‌ర‌ణ

Leave A Reply

Your Email Id will not be published!