Swami Chinmayanand : స్వామి చిన్మ‌యానంద‌కు కోర్టు బిగ్ షాక్

నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ

Swami Chinmayanand :  కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మ‌యానంద‌కు(Swami Chinmayanand) కోలుకోలేని షాక్ ఇచ్చింది కోర్టు. అత్యాచారం కేసులో స్వామి చిన్మ‌యానంద‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది.

యూపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రిపై పెండింగ్ లో ఉన్న రేప్ కేసులో హాజ‌రు కావాల్సి ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టుకు రాలేదు. దీంతో సీరియ‌స్ గా ప‌రిగ‌ణించిన కోర్టు  నాన్ బెయిల‌బుల్ వారెంట్ (ఎన్బీడ‌బ్ల్యు) జారీ చేసింది.

షాజ‌హాన్ పూర్ లోని అద‌న‌పు చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు ముందు నిల‌దీయాల‌ని కోరారు. స్వామి చిన్మ‌యానంద స‌ర‌స్వ‌తి ముముకు ఆశ్ర‌మాన్ని ఏర్పాటు చేశాడు.

స‌ద‌రు సంస్థ అనేక విద్యా సంస్థ‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ఇదిలా ఉండ‌గా త‌దుప‌రి విచార‌ణ తేదీ సెప్టెంబ‌ర్ 26న నిందితుడిని హాజ‌రు ప‌రిచేలా చూడాల‌ని కింది కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా స్వామి చిన్మ‌యానంద‌కు(Swami Chinmayanand) సంబ‌ధించి 2011లో లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడంటూ కేసు న‌మోదైంది. అనంత‌రం 2012 అక్టోబ‌ర్ లో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖ‌లు చేశారు.

ఈ కేసుకు సంబంధించి అల‌హాబాద్ హైకోర్టు స్టే ఆర్డ‌ర్ జారీ చేసింది. ఆ త‌ర్వాత కేసు విచార‌ణ ప్ర‌క్రియ ప్రారంభం కాలేదు.

ఇక యూపీలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం 2018లో స్వామి చిన్మ‌యానంద‌పై ఉన్న‌కేసును ఉపసంహ‌రించు కోవాల‌ని నిర్ణ‌యించింది.

సీపీసీ సెక్ష‌న్ 321 ప్ర‌చారం చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ కోర్టులో ద‌ర‌ఖాస్తు కూడా దాఖ‌లు చేసింది. అత్యాచార బాధితురాలు అభ్యంత‌రం దాఖ‌లు చేయ‌డంతో ద‌ర‌ఖాస్తును సీజీఎం తిర‌స్క‌రించింది.

Also Read : రాహుల్ ఆశా కిర‌ణం కానున్నారా

Leave A Reply

Your Email Id will not be published!