MP Sanjay Singh : ఆపరేషన్ లోటస్ ఫెయిల్ – సంజయ్ సింగ్
గుజరాత్ లో భారతీయ జనతా పార్టీకి ఓటమి ఖాయం
MP Sanjay Singh : ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చాలని కేంద్రం, బీజేపీ యత్నిస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh) ఆరోపించారు.
అయితే మోదీ ఆటలు, అమిత్ షా వ్యూహాలు ఇక్కడ వర్కవుట్ కాలేదన్నారు. త్వరలో గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని బీజేపీకి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు.
బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవన్నారు. కాగా వారు అమలు చేస్తున్న ఆపరేషన్ లోటస్ కింద ఇప్పటి వరకు బీజేపీ 285 మంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు సంజయ్ సింగ్(MP Sanjay Singh).
మోదీ కొలువు తీరిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ యేతర ప్రభుత్వాలను ఎనిమిది రాష్ట్రాలను పడగొట్టారంటూ ధ్వజమెత్తారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి బడా బాబులకు వత్తాసు పలుకుతున్న బీజేపీకి ఆప్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
అయితే సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ను బీజేపీ మెగాలోమానియాక్ అని పేరు పెట్టింది. దీనిని ఎంపీ సంజయ్ సింగ్ తప్పు పట్టారు. మళ్లింపు వ్యూహాలను ప్రయోగించకండి. మేం అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఎంత ఖర్చు చేసిందో దేశానికి తెలియ చేయాలని ఎంపీ సవాల్ విసిరారు.
గుజరాత్ లో ఓడి పోతామనే భయంతో తమను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : ఓటమి భయంతోనే ఆప్ పై దాడులు