BJP Shinde Win : పంచాయతీ ఎన్నికల్లో షిండే సర్కార్ హవా
16 జిల్లాలు 547 గ్రామ పంచాయతీలు
BJP Shinde Win : కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ , ఏక్ నాథ్ షిండే క్యాంప్ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని 16 జిల్లాలలో 547 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ లో 76 శాతం నమోదైంది.
ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో 259 మంది బీజేపీ మద్దతుతో సర్పంచ్ లుగా గెలుపొందగా ఏక్ నాథ్ షిండే వర్గం(BJP Shinde Win) మద్దతుతో 40 మంది అభ్యర్థులు సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు.
ఈ విషయాన్ని బీజేపీ మహారాష్ట్ర యూనిట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్ కులే వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది.
గ్రామ పంచాయతీలకు ఎన్నికలతో పాటు గ్రామ సర్పంచ్ ల పదవులకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. బవాన్ కులే మీడియాతో మాట్లాడారు.
తమ సంకీర్ణ సర్కార్ అద్బుత విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. ప్రజలు తమ పాలన పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పేందుకు ఈ విజయం ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే సంకీర్ణ సర్కార్ గెలుపొందడం, సత్తా చాటడం ఖాయమని జోష్యం చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్. శివసేన వర్గం మద్దతుతో విజయం సాధించడం కూడా తమకు అడ్వాంటేజ్ కానుందని పేర్కొన్నారు.
మొత్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లలో 50 శాతానికి పైగా షిండే – బీజేపీ కూటమికి మద్దతుదారులేనని స్పష్టం చేశారు బావన్ కులే. శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈ ఫలితాలు కోలేకోలేని దెబ్బగా పరిగణించవచ్చు.
Also Read : కాంగ్రెస్ చీఫ్ రేసులో ఆ ఇద్దరు