Mark Zuckerberg : జుకెర్ బర్గ్ ఆదాయంపై మెటా ఎఫెక్ట్
ప్రతి ఏటా తగ్గుతూ వస్తున్న ప్రాఫిట్
Mark Zuckerberg : ఫేస్ బుక్ ఫౌండర్ , సిఇఓ మార్క్ జుకర్ బర్గ్(Mark Zuckerberg) మెటా డెవలప్ మెంట్ కోసం ఏకంగా $71 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా.
ఫేస్ బుక్ ను మెటాగా మార్చారు. ఇందు కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. $55.9 బలియిన్ల నికర విలువతో బిలియన్లర్లలో మార్క్ జుకర్ బర్గ్ 20వ స్థానంలో ఉన్నారు.
38 ఏళ్ల మార్క్ విలువ రెండేళ్ల కిందటే 106 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక జుకర్ బర్గ్(Mark Zuckerberg) మెటా వర్క్స్ లోకి మార్చడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దానిని ప్రమోట్ చేసేందుకు, అభివృద్ది పర్చేందుకు గాను దాదాపు పెద్ద ఎత్తున ఖర్చు అయ్యింది.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా ట్రాక్ చేయబడిన అత్యంత సంపన్నుల్లో మార్క్ జుకెర్ బర్గ్ సంపద చాలా వరకు సగానికి పైగా తగ్గి పోయింది.
ఇది గమనించ దగిన విషయం. ఈ ఏడాది ఇప్పటి వరకు $71 బిలియన్లకు పడి పోయింది. 2014 నుండి మార్క్ జుకెర్ బర్గ్ ఆదాయపు విలువ తగ్గుతూ వస్తోంది.
$106 బిలియన్ల విలువ ప్రపంచ బిలియనీర్ల సమూహంలో రెండు సంవత్సరాల కిందటే బెజోస్ , బిల్ గేట్స్ మాత్రమే ముందంజలో ఉన్నారు.
సెప్టెంబర్ 2021లో కంపెనీ షేర్లు $382కి చేరుకున్న సమయంలో జుకెర్ బర్గ్ సంపద గరిష్టంగా $142 బిలియన్లకు చేరుకుంది. తర్వాతి నెలలో జుకెర్ బర్గ్ మెటాను పరిచయం చేశాడు.
కంపనీ పేరును ఫేస్ బుక్ . ఇంక్ నుండి మార్చాడు. నెల వారీ ఫేస్ బుక్ వినియోగదారులలో ఎటువంటి వృద్ది లేదని కంపెనీ వెల్లడించింది. జుకెర్ బర్గ్ సంపదను $31 బిలియన్లకు తగ్గించింది.
Also Read : భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ