NDMA Amit Shah : 28న ఎన్డీఎంఏ ఆవిర్భావ దినోత్సవం
హాజరు కానున్న కేంద్ర మంత్రి అమిత్ షా
NDMA Amit Shah : నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈనెల 28న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(NDMA Amit Shah) హాజరు కానున్నారు.
ఇందులో భాగంగా 2005న డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టాన్ని ఆమోదించింది. ఎన్డీఎంఎ ఏర్పడి ఈ నెలతో సరిగ్గా 18 ఏళ్లు అవుతుంది. అక్కడ ఏర్పాటు చేసే సమావేశంలో షా ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా పాల్గొననున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) నేతృత్వంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు.
సంబంధిత ముఖ్యమంత్రుల నేతృత్వంలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీలను (ఎస్డీఎంఏ)లను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.
భారత దేశంలో విపత్తు నిర్వహణకు సమగ్ర విధానాన్ని నడిపించడం , అమలు చేయడం, పర్యవేక్షించడం చేస్తుంది.
ఎన్డీఎంఏ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమగ్రమైన, చురుకైన , సాంకేతికతతో నడిచే , స్థిరమైన అభివృద్ది వ్యూహాన్ని అమలు చేయడం. తద్వారా సురక్షితమైన, విపత్తులను తట్టుకునే భారత దేశాన్ని నిర్మించడం.
ఇది అన్ని వాటాదారులను కలిగి ఉంటుంది. నివారణ, సంసిద్దత, ఉపశమన సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. దేశ నిర్వహణలో ఎన్డీఎంఏ కీలక పాత్ర పోషించనుంది.
విపత్తులకు యుద్ద ప్రాతిపదికన, సమర్థవంతమైన ప్రతిస్పందనను అందించేందుకు ఎన్డీఎంఏ(NDMA) విధానాలు, ప్రణాళికలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది.
2005 విపత్తు నిర్వహణ చట్టం (ఎన్డీఎంఏ) ఏర్పాటు, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో సంస్థాగత యంత్రాంగాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం తప్పనిసరి చేసింది.
Also Read : పంచాయతీ ఎన్నికల్లో షిండే సర్కార్ హవా