Heavy Rain Alert : తెలంగాణ..ఒడిశాలో రెడ్ అలర్ట్
భారీగా వర్షాలు కురుస్తాయని వార్నింగ్
Heavy Rain Alert : జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో(Heavy Rain Alert) పెద్ద ఎత్తున వర్షాలు కురియనున్నాయని తెలిపింది. ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయువ్య భారతంలో యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కారణంగా పశ్చిమ రాజస్థాన్ , పంజాబ్, హర్యానా, చండీగఢ్ , ఢిల్లీ రాష్ట్రాలలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో చాలా చోట్ల తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు రానున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ.
అంతే కాకుండా కచ్ లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతు పవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఒడిశా, కోస్తా, ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్ గఢ్ మీదుగా సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతాయని తెలిపింది. ఛత్తీస్ గఢ్ , ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు మంగళ, బుధవారాల్లో ఎల్లో అలర్ట్(Heavy Rain Alert) ప్రకటించింది.
ఈ రాష్ట్రాలలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల అంచనా కారణంగా ఒడిశా రాష్ట్రం అరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఒడిశా లోని కొండ ప్రాంతాలలో కొండ చరియలు విరిగి పడటం, బలహీనమైన ఇళ్ల గోడులు కూలి పోవడం, లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో దౌడు తీస్తున్న పారిశ్రామిక రంగం