Jairam Ramesh : ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు
ఎలాంటి ఆంక్షలు..రూల్స్ అంటూ లేవు
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎవరు చీఫ్ గా 134 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఎన్నికవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వచ్చే అక్టోబర్ 17న పార్టీ పదవి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇదే క్రమంలో ఎవరు బరిలో ఉంటారనేది ఊహాగానాలకు తెర లేచింది.
ఇప్పటి వరకు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ గా సోనియా గాంధీ(Sonia Gandhi) ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ ఉన్నా ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని భుజాన మోస్తున్నారు. చాలా మంది సీనియర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారు. మరికొందరు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు.
ఈ తరుణంలో పార్టీలో జి23 సమూహంలో కీలక నాయకుడిగా ఉన్న ఎంపీ శశి థరూర్(Sashi Tharoor) తాను అధ్యక్ష పదవి బరిలో ఉంటానంటూ ప్రకటించారు.
అయితే పార్టీలో అధ్యక్ష పదవికి సంబంధించి పూర్తిగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారి మిస్త్రీపై ఉందని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఐదుగురు ఎంపీలతో కలిసి ఓ లేఖ కూడా రాశారు. అది దేశ వ్యాప్తంగా పార్టీలో చర్చకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్(Jairam Ramesh) మంగళవారం సీరియస్ గా స్పందించారు.
ఈ దేశంలో ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నది కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఎవరైనా మొత్తం 9,000 వేల మంది సభ్యులలో అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చంటూ స్పష్టం చేశారు జైరాం రమేష్.
Also Read : కాంగ్రెస్ చీఫ్ రేసులో ఆ ఇద్దరు