MP A Raja : డీఎంకే ఎంపీ రాజాపై స్పీకర్ కు ఫిర్యాదు
మనుస్మృతిని అవమానించారంటూ ఫైర్
MP A Raja : తమిళనాడు ఎంపీ , మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా(MP A Raja) ఇటీవల మను స్మృతిపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
మనుస్మృతిలో శూద్రులను అవమానించారని పేర్కొన్నారు. అంతే కాకుండా సమానత్వం, విద్య, ఉపాధి, దేవాలయాలలో కావాలని ప్రవేశాన్ని నిరాకరించారని ఆరోపించారు రాజా.
దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఎంపీ ఎ. రాజాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.
ఆయన తన పరిధులను దాటి మాట్లాడారని, హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని పేర్కొనారు. ఒకరికంగా ఒకరి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడటం నేరం అవుతుందని , ఆ విషయం తెలిసి కూడా కావాలనే రెచ్చగొట్టేందుకు రాజా ఇలాంటి చౌకబారు విమర్శలు చేశారంటూ మండిపడ్డారు.
ఇందుకు సంబంధించి హిందువులపై ద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు డీఎంకే ఎంపీ రాజాపై(MP A Raja) లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసినట్లు తమిళనాడుకు చెందిన సీనియర్ నాయకుడు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, సోషల్ మీడియా చీఫ్ సీటీఆర్ నిర్మల్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆయన ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఇలా మాట్లాడ కూడదని కానీ ఆయన కావాలని చేశారంటూ ఆరోపించారు.
ప్రస్తుతం రాజా డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.
Also Read : 28న ఎన్డీఎంఏ ఆవిర్భావ దినోత్సవం