BJP Protest : పశువుల మరణాలపై బీజేపీ ఆందోళన
రాజస్థాన్ లో తీవ్ర ఉద్రిక్తత..లాఠీచార్జి
BJP Protest : రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ ఆందోళన బాట(BJP Protest) పట్టింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో చర్మ వ్యాధి కారణంగా పెద్ద సంఖ్యలో పశువుల మరణాలు నమోదు అవుతున్నాయి.
ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదంటూ బీజేపీ మంగళవారం జైపూర్ లో భారీ ప్రదర్శన చేపట్టింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరికొందరు బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ సతీష్ పూనియా బారికేడ్లను దాటుకుని రావడాన్ని అడ్డుకున్నారు.
సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము న్యాయ బద్దంగా నిరసన తెలుపుతుంటే కావాలని అడ్డుకున్నారంటూ బీజేపీ చీఫ్ ఆరోపించారు.
అయితే పశువులలో నెలకొన్న వ్యాధి తీవ్రత పట్ల సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. వైరస్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్లను కేంద్రం ఇవ్వాల్సి ఉందని కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు.
అందువల్ల తాము ఏమీ చేయలేక పోతున్నామని పేర్కొన్నారు సీఎం. చర్మ వ్యాధులు ప్రబలుతున్న విషయాన్ని ముందే కేంద్రానికి తెలియ చేశాం.
అటు వైపు నుంచి స్పందన రాలేదు. ప్రతి పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాం. మత పెద్దలతో కూడా మాట్లాడాం. ఆవుల ప్రాణాలను కాపాడటం మా కర్తవ్యం.
ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ప్రతిదానిని రాజకీయం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు గెహ్లాట్. ఇప్పటి వరకు నెల గడిచి పోయింది కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క టీకా కానీ మందులు కానీ ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు సీఎం.
Also Read : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు జరిమానా