NALSAR MOU AP : ఏపీ సర్కార్ తో నల్సార్ ఒప్పందం
ల్యాండ్ రీ సర్వే ప్రాజెక్టు కోసం ఓకే
NALSAR MOU AP : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో మొత్తం భూమిని రీ సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ రెడ్డి.
ఈ మేరకు ల్యాండ్ రీ సర్వే ప్రాజెక్టు కోసం చట్ట పరమైన మద్దతు అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ప్రముఖ న్యాయ సంస్థ నల్సార్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
దీనికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ మక్కు పథకంగా పేరు పెట్టారు. దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు. ఈ పథకంలో భాగంగా శాశ్వత భూ హక్కు, భూ రిక్షా పథకం కోసం న్యాయ పరమైన సహకారం అందించడం కోసం నల్సార్ గిరిజన(NALSAR MOU AP), భూమి హక్కుల కేంద్రం (సీటీఎల్ఆర్) తో ఏపీ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఏపీ ప్రభుత్వం 100 సంవత్సరాలకు పైగా వ్యవసాయ , వ్యవసాయేతర భూములపై భారీ రీ సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని భూములను సర్వే చేపట్టి జియో క్వాడ్రంట్ లతో నంబర్లు ఇస్తారు.
ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం చట్ట పరమైన పత్రాలను రూపొందించడం, సమీక్షించడం , సిద్దం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది నల్సార్.
శిక్షణ ఇవ్వడం, లీగల్ రీసెర్చ్ చేపట్టడం, భూ వివాదాలను పరిష్కరించడం, రైతులకు చట్ట పరమైన అవగాహన కల్పించడం వంటివి నల్సార్ చేస్తుంది.
రీ సర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహన మెటీరియల్ ని సిద్దం చేస్తుంది. పునః సర్వే ప్రాజెక్టు అమలులో పాల్గొన్న వివిధ వాటాదారులకు శిక్షణ ఇస్తుంది నల్సార్.
Also Read : తెలంగాణ..ఒడిశాలో రెడ్ అలర్ట్