CM YS Jagan : రేపటి భవిష్యత్తు కోసం నేడు పెట్టుబడి
విద్యా రంగం అభివృద్దికి ఏపీ పెద్దపీట
CM YS Jagan : దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
ఇవాళ విద్య కోసం వెచ్చించే మొత్తం రేపటి భవిష్యత్తు కోసం పెట్టుబడి అని స్పష్టం చేవారు. రాబోయే తరాన్ని ఆత్మ విశ్వాసంతో , సమర్థులైన నాయకులు తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం.
పాఠశాల స్థాయి నుంచి యూనివర్శిటీ దాకా పెను మార్పులు చేశామన్నారు. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశామని తెలిపారు. శరవేగంగా పరుగులు తీస్తున్న పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా తీర్చి దిద్దేందుకు ఫోకస్ పెట్టామన్నారు జగన్ రెడ్డి(CM YS Jagan).
నాడు నేడు కార్యక్రమం ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నో రాష్ట్రాలు తమను చూసి నేర్చుకుంటున్నాయని కొనియాడారు.
ఇవాళ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు ధీటుగా బడులను తయారు చేశామని చెప్పారు జగన్ రెడ్డి. అంతే కాకుండా నాణ్యమైన వైద్యాన్ని నిరుపేదలకు చేరువ చేసేందుకు వైద్య, ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చామన్నారు సీఎం.
విద్యా హక్కు కోసమే కాకుండా ఇంగ్లీష్ మీడియం హక్కు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుండి కాలేజీ వరకు ప్రోత్సాహకాలతో ఉన్నత విద్యను పొందే హక్కు గత సర్కార్ స్వార్థ ప్రయోజనాలతో కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రయ్నతం చేసిందని ధ్వజమెత్తారు జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan).
దానిని తాము పూర్తిగా మార్చేసినట్లు తెలిపారు.ఇవాళ అన్ని వర్గాలకు చెందిన వారంతా ప్రభుత్వ బడులు,కాలేజీల్లో చేరుతున్నారని వెల్లడించారు.
Also Read : కేటీఆర్ కు డిజిటల్ బ్రిడ్జ్ ఫోరమ్ ఆహ్వానం