Bathukamma Festival : 25 నుంచి బతుకమ్మ సంబరం
తొమ్మిది రోజుల పాటు వేడుకలు
Bathukamma Festival : తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) రానే వచ్చింది. రాష్ట్రంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు 14 రోజుల పాటు సెలవులు కూడా మంజూరు చేసింది. మహిళలకు ఇది అత్యంత ముఖ్యమైన పండుగ.
సెప్టెంబర్ 25 నుంచి తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి బతుకమ్మ ఉత్సవాలు. ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనంలో బతుకమ్మ కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది.
ఇదిలా ఉండగా ఉత్సవాల సందర్భంగా పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర సర్కార్ చీరెలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. బతుకమ్మ అనేది చిత్రమైన పండుగ. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ సంబురం కొనసాగుతుంది.
దీని ప్రత్యేకత ఏమిటంటే అంతటా దేవుళ్లకు పూలతో పూజలు చేస్తారు. కానీ బతుకమ్మ ఉత్సవాలలో(Bathukamma Festival) పూలకు పూజలు చేసి కొలవడం ఈ పండుగ ప్రత్యేకత.
ఇక తొమ్మిది రోజులలో భాగంగా అమవాస్య రోజున బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది. దీనిని పెత్తర అమవాస్య అని కూడా పిలుస్తారు.
గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా వంటి చోట్ల కూడా బతుకమ్మ ఆడతారు. ప్రతి ఏటా భాద్రప్రద మాసలో బహుళ అమావాస్య నుంచి అశ్వియుజ మాసం శుద్ద అష్టమి వరకు సంబురాలు కొనసాగుతాయయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ కోసం ఆడపడుచులు ఏర్పాట్లలో మునిగి పోయారు.
Also Read : రికార్డు స్థాయిలో పంటల సాగు