RSS Chief : మ‌సీదును సంద‌ర్శించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

ఇలియాస్ తో మోహ‌న్ భ‌గవ‌త్ స‌మావేశం

RSS Chief : దేశంలో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు తీవ్రమ‌వుతున్న త‌రుణంలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్ కీల‌కంగా మారారు. గురువారం ఉన్న‌ట్టుండి ఆర్ఎస్ఎస్ చీఫ్(RSS Chief) ఢిల్లీలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

ఆపై ఆయ‌న మ‌సీదును సంద‌ర్శించ‌డం క‌ల‌క‌లం రేపింది. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇటీవ‌ల ముస్లిం మ‌త పెద్ద‌లు, మేధావులు, ప్ర‌జా ప్ర‌తినిధులతో మోహ‌న్ భ‌గ‌వత్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదే స‌మ‌యంలో గురువారం దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున ఉన్న మ‌సీదులో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌ధాన మ‌త పెద్ద ఉమ‌ర అహ్మ‌ద్ ఇలియాస్ తో మోహ‌న్ భ‌గ‌వత్ స‌మావేశం అయ్యారు.

వీరిద్ద‌రూ గంట‌కు పైగా చ‌ర్చించారు. ప్ర‌ధానంగా క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో జ్ఞాన వాపి కేసు, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నూపుర్ శ‌ర్మ కామెంట్స్ , త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల‌పై, వివాదాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

దీనిని క్లోజ్ డోర్ మీటింగ్ గా మ‌త పెద్ద‌లు అభివ‌ర్ణించారు. మ‌త సామ‌రస్యాన్ని బ‌లోపేతం చేయ‌డం కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ గ‌త కొన్ని రోజులుగా ముస్లిం మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఆర్ఎస్ఎస్ సంఘ చాల‌క్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తారు. ఇది నిరంత‌ర సాధార‌ణ సంవాద్ (ప్ర‌క్రియ‌)లో భాగ‌మ‌ని ఆర్ఎస్ఎస్ అధికార ప్ర‌తినిధి సునీల్ అంబేక‌ర్(RSS Chief) స్ప‌ష్టం చేశారు.

అస‌మ్మ‌తి వాతావ‌ర‌ణంతో తాను సంతోషంగా లేన‌ని, ఇది పూర్తిగా త‌ప్పు. స‌హ‌కారం, ఐక్య‌త‌తో మాత్ర‌మే దేశం ముందుకు వెళుతుంద‌న్నారు భ‌గ‌వత్.

Also Read : జ్ఞాన వాపి కేసు తీర్పుపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!