Rahul Gandhi : జోడు ప‌ద‌వుల‌పై రాహుల్ గాంధీ కామెంట్స్

ఒక‌రికి ఒకే ప‌ద‌వి అన్న‌ది ముఖ్యం

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రైనా స‌రే ఒక‌రికి ఒకే ప‌ద‌వి ఉండాల‌ని గ‌తంలో ప‌లుమార్లు ఉద్గాటించారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ.

ప్ర‌స్తుతం ఎవ‌రైనా స‌రే రెండు ప‌ద‌వుల‌ను క‌లిగి ఉన్నా లేదా కావాల‌ని అనుకున్నా పార్టీ అందుకు ఒప్పుకోద‌ని సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించారు గాంధీ.

త‌మిళ‌నాడు వేదిక‌గా రాహుల్ గాంధీ(Rahul Gandhi) భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో ముగిసింది యాత్ర‌. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతోంది.

ఈసంద‌ర్భంగా ఇవాళ ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎన్నిక కోసం పార్టీ నోటిఫికేష‌న్ ను జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 24 నుంచి పార్టీ చీఫ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తుంది.

ఈనెలాఖ‌రు వ‌ర‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 9,000 మంది స‌భ్యులు క‌లిగి ఉన్నారు. అక్టోబ‌ర్ 17న ఎన్నిక జ‌రుగుతుంది.

19న ఫ‌లితం వెలువ‌డుతుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ తాను బ‌రిలో ఉండ‌డం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ త‌మ త‌ర‌పున రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కు లైన్ క్లియ‌ర్ చేసింది.

దీంతో ఆయ‌న సీఎంగా ఉంటారో ఉండ‌రోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. దీనిపై ఆయ‌న కూడా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లినా తాను మాత్రం రాజ‌స్థాన్ ను విడిచి ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని చెప్పారు.

దీంతో దీనిపై అభ్యంత‌రం తెలిపారు స‌చిన్ పైల‌ట్. ఆయ‌న సీఎం పద‌విని ఆశిస్తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై ఉత్కంఠ‌కు తెర దించారు రాహుల్ గాంధీ. ఒక‌రికి ఒకే ప‌ద‌వి అన్న‌ది మ్యాండేట్ అని పేర్కొన్నారు.

Also Read : పంజాబ్ సీఎం ముట్ట‌డి ఉద్రిక్తం

Leave A Reply

Your Email Id will not be published!