Congress President Poll : కాంగ్రెస్ చీఫ్ బ‌రిలో క‌మ‌ల్ నాథ్

నోటిఫికేష‌న్ జారీతో పార్టీలో సంద‌డి

Congress President Poll : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష(Congress President Poll) ప‌ద‌వికి సంబంధించి ఇవాళ పార్టీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు పెద్ద ఎత్తున బ‌రిలో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ తాను పోటీలో ఉండ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. దీంతో గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ ఉండ‌రు.

కానీ గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న నాయ‌కులు బ‌రిలో ఉండే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ఇప్ప‌టికే సోనియా గాంధీ రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం.

మ‌రో వైపు దేశంలోని ఆయా రాష్ట్రాల యూనిట్లు అన్నీ ముక్త కంఠంతో రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ కావాల‌ని కోరుతున్నాయి. ఈ త‌రుణంలో గాంధీ ఫ్యామిలీని వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న అస‌మ్మ‌తి వ‌ర్గానికి చెందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కూడా పోటీలో ఉంటాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

దీంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. తాజాగా మ‌రో పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌ధ్య ప్ర‌దేశ్ మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్(Kamal Nath)  కూడా పోటీలో ఉండ‌నున్న‌ట్లు టాక్.

ఈనెలాఖ‌రు వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించనున్న‌ట్లు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. అక్టోబ‌ర్ 17న పోలింగ్ , 19న ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌క‌టంచ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా ఊహించ‌ని రీతిలో సోనియా గాంధీ ప‌ర్మిష‌న్ కూడా తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు శ‌శి థ‌రూర్(Sashi Tharoor). మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవ‌రు ఎన్నిక అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

కాగా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో మాజీ మంత్రులు మ‌నీష్ తివారీ, పృథ్వీరాజ్ చౌహాన్, ముకుల్ వాస్నిక్, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య కూడా ఉన్నారు.

Also Read : జోడు ప‌ద‌వుల‌పై రాహుల్ గాంధీ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!