Asaduddin Owaisi : ముస్లిం నేతలపై అసదుద్దీన్ ఓవైసీ గుస్సా
వాళ్లకు వాస్తవ పరిస్థితులు తెలియవు
Asaduddin Owaisi : దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి మూల స్తంభంగా ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వరుసగా ముస్లిం మత పెద్దలు, మేధావులు, భావ సారూప్యత కలిగిన వారితో సమావేశం అవుతున్నారు.
ఆయనను ముస్లిం మత పెద్దలు , మేధావులు, ప్రజా ప్రతినిధులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) స్పందించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం నేతలపై నిప్పులు చెరిగారు. దేశంలో వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయో వారికి తెలియడం లేదన్నారు ఓవైసీ.
ఆర్ఎస్ఎస్ చీఫ్ ను కలవడం వల్ల ముస్లింలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేవి పరిష్కారం కావన్నారు ఎంపీ. మోహన్ భగవత్ ను ఏ ప్రాతిపదికన, దేని కోసం , ఎవరి ప్రయోజనాల కోసం కలిశారంటూ ముస్లిం నేతలపై విరుచుకు పడ్డారు.
ప్రాథమికంగా ఏం జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. ఇవాళ దేశంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఓవైసీ(Asaduddin Owaisi) .
ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలిసిన వారిలో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ, ఢిల్లీ మాజీ ఎల్పీ నజీబ్ జంగ్ , అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మాజీ వీసీ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎం పీ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షెర్వానీ ఉన్నారు.
ఓవైసీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : పార్టీ శాశ్వత చీఫ్ గా జగన్ ఎన్నిక చెల్లదు