Prithviraj Chavan : పార్టీ చీఫ్ పార్ట్ టైమ్ గా ఉండకూడ‌దు – చౌహాన్

మాజీ సీఎం సంచ‌ల‌న కామెంట్స్

Prithviraj Chavan : మ‌హారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు పృథ్వీరాజ్ చౌహాన్(Prithviraj Chavan) షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీకి సంబంధించి అధ్య‌క్ష ఎన్నిక వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 17న జ‌ర‌గ‌నుంది.

19న ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు ఎన్నిక‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ మ‌ధుసూద‌న్ మిస్త్రీ. ఎన్నిక పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉండాల‌ని కోరుతున్నారు.

ఐదుగురితో కూడిన ఎంపీల బృందం లేఖ రాయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. మ‌రో వైపు గాంధీ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క‌రూ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌డం లేదంటూ ప్ర‌క‌టించారు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.

ఇక అస‌మ్మ‌తి నాయ‌కుడిగా పేరొందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Sashi Tharoor) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను కూడా పీసీసీ చీఫ్ బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక ఎన్నిక‌కు సంబంధించి ఇవాల్టి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు మిస్త్రీ. ఈ స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం చౌహాన్.

అంత‌ర్గ‌త ఎన్నిక‌ల‌తో 23 మంది అస‌మ్మ‌తి నేత‌ల డిమాండ్లు నెర‌వేరాయ‌ని పేర్కొన్నారు.గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా పేరొందిన అశోక్ గెహ్లాట్ పోటీలో ఉండ‌నున్నారు.

ఆయ‌న‌కు మేడం ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయి. తాము పూర్తి పాద‌ర్శ‌క‌త‌తో ఎన్నిక జ‌ర‌గాల‌ని కోరుతూ వ‌చ్చామ‌న్నారు. కానీ మేడం సోనియా గాంధీతో పోటీ ప‌డేందుకు కాద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా పార్టీలో ఒక‌రికి ఒక ప‌ద‌వి మాత్ర‌మే క‌లిగి ఉండాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). తాము పార్టీ చీఫ్ ఫుల్ టైమ్ అయితే బాగుంటుంద‌ని కానీ పార్ట్ టైమ్ ఎంత మాత్రం కాద‌న్నారు పృథ్వీరాజ్ చౌహాన్.

Also Read : అసెంబ్లీ వ్య‌వ‌హారాలు గ‌వ‌ర్న‌ర్ డొమైన్ కాదు

Leave A Reply

Your Email Id will not be published!