Shahabuddin Razvi : పీఎఫ్ఐని నిషేధించాలి- ష‌హ‌బుద్దీన్ ర‌జ్వీ

ఆల్ ఇండియా ముస్లిం జ‌మాత్ ప్రెసిడెంట్

Shahabuddin Razvi : అనేక వామ‌ప‌క్ష తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధాలు ఉన్నాయ‌ని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఆరోపించింది.

తీవ్ర‌వాద సంబంధిత కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు బరేల్వి ఉలేమా చీఫ్ దానిపై నిషేధం విధించాల‌ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎన్ఐఏ, ఈడీ క‌లిసి సంయుక్తంగా దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల దాడులు చేప‌ట్టింది.

పీఎఫ్ఐ నాయ‌కుల‌తో సంబంధం ఉన్న ప్రాంగ‌ణాల‌పై సోదాలు నిర్వ‌హించింది. ఏకంగా 106 మందికి పైగా అరెస్ట్ చేసింది. దీనిపై కేంద్ర హోం శాఖ కీల‌క స‌మావేశం చేప‌ట్టింది.

ప్ర‌ధానంగా స‌ద‌రు సంస్థ‌ను నిషేధించాల‌ని డిసైడ్ అయ్యింది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క స‌ర్కార్ ఆ దిశ‌గా అడుగులు వేసింది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అర‌గ జ్ఞానేంద్ర ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఆల్ ఇండియా ముస్లిం జ‌మాత్ ప్రెసిడెంట్ మౌలానా ష‌హ‌బుద్దీన్ రిజ్వీ బరేల్వి రికార్డెడ్(Shahabuddin Razvi)  స్టేట్ మెంట్ ను విడుద‌ల చేశారు.

ఇస్లామిస్ట్ ఛాంద‌స‌వాద సంస్థ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల‌లో మ‌త ప‌ర‌మైన అల్లర్ల‌లో పాల్గొన్న‌ట్లు దాడులు స్ప‌ష్టం చేశాయ‌ని పేర్కొన్నారు.

అందుకే సున్నీ, సూఫీ, బ‌రేల్వి ముస్లిలంద‌రినీ ఈ సంస్థ‌తో ఎలాంటి సంబంధం పెట్టుకోవ‌ద్ద‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు.

దేశ స‌మైక్య‌త‌, సమ‌గ్ర‌త‌ను కాపాడేందుకు ఇలాంటి సంస్థ‌ల‌పై త‌క్ష‌ణ‌మే నిషేధం విధించాల‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని బ‌రేలీకి చెందిన బరేల్వి వ‌ర్గం కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసింది.

భార‌త దేశం అంత‌టా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు ఉచ్చును బిగించేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌కు మౌలానా బ‌రేల్వి కూడా మ‌ద్ద‌తు ప‌లికారు.

Also Read : పంజాబ్ లో సీఎం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్

Leave A Reply

Your Email Id will not be published!