Srikanth Shinde : సీఎం సీటులో శ్రీకాంత్ షిండే వైరల్
ఏక్ నాథ్ షిండే లేని సమయంలో
Srikanth Shinde : మరాఠాలో శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ చిక్కుల్లో పడింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా కొలువు తీరారు.
కానీ ఆయన లేని సమయంలో తన సీఎం సీటుపై కొడుకు శ్రీకాంత్ షిండే(Srikanth Shinde) ఆసీనులు కావడం, అధికారులతో ముచ్చటించడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
నెట్టింట్లో ఇదేమిటి నిర్వాకం అంటున్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్దమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా తండ్రి కుర్చీలో కూర్చున్న శ్రీకాంత్ షిండేకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). దీనిపై తీవ్రంగా తప్పు పట్టారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. చివరకు సీఎం పదవికి కూడా విలువ లేని పరిస్థితి దాపురించిందంటూ మండిపడ్డారు.
అక్రమంగా నమ్మిన వారిని మోసం చేసి పదవిలోకి వచ్చిన ఏక్ నాథ్ షిండే ఇంతకంటే ఏం చేయగలరని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని నిలదీశారు.
ఇదిలా ఉండగా సీఎం కుర్చీపై కూర్చోవడం తీవ్ర రాద్దాంతానికి దారి తీయడంతో ఏక్ నాథ్ షిండే తనయుడు శ్రీాకంత్ షిండే స్పందించారు.
తన తండ్రికి కేటాయించిన సీటులో తాను కూర్చోలేదని స్పష్టం చస్త్రశారు. ఇదంతా విపక్షాలు చేస్తున్న అబద్దపు ప్రచారమేనని కొట్టి పారేశారు సీఎం తనయుడు.
ఇదిలా ఉండగా శ్రీకాంత్ షిండే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఇది థానే లోని వ్యక్తిగత నివాసం కాదని, కార్యాలయం అని స్పష్టం చేశారు. ఈ ఫోటోను ఎన్సీపీ అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే ట్వీట్ చేశారు.
Also Read : స్మతీ ఇరానీపై ప్రియాంక సెటైర్