S Jai Shankar : ర‌క్త‌పు మ‌ర‌క‌ల్ని చెర‌ప‌లేం – జై శంక‌ర్

పాకిస్తాన్..చైనా ఉగ్ర‌వాదంపై కామెంట్స్

S Jai Shankar : విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పాకిస్తాన్, చైనా దేశాల‌ను దృష్టిలో పెట్టుకుని కీల‌క కామెంట్స్ చేశారు.

ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించే ఏ దేశ‌మైనా లేదా క‌మ్యూనిజం పేరుతో రాచ‌రికపు పాల‌న సాగిస్తున్న చైనా లాంటి దేశాలు ఏదో ఒక రోజు తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

ఇదే క్ర‌మంలో దారుణాలు, దురాగ‌తాల‌కు పాల్ప‌డుతూ హింసోన్మాదంతో చెల‌రేగే ఉగ్ర‌వాదాల‌కు స‌పోర్ట్ గా నిలిచే వారిని ఎవ‌రూ క్ష‌మించ‌ర‌న్నారు జై శంక‌ర్.

ఆంక్ష‌ల పాల‌న‌ను రాజ‌కీయం చేసే వారు త‌మ సొంత ప్ర‌మాదంలో అలా చేస్తారంటూ మండిప‌డ్డారు. అత్యున్న‌త స్థాయి ఐక్య‌రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ సెష‌న్ లో విదేశాంగ శాఖ మంత్రి కీల‌క ప్ర‌సంగం చేశారు.

ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ , దానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న చైనా తాము దొవ్వుకున్న గోతిలో తాము ప‌డ‌క త‌ప్ప‌ద‌న్నారు. జై శంక‌ర్ చెప్పిన‌ట్లు ఇవాళ పాకిస్తాన్ లో ఆర్మీదే అధికారం.

ఇక చైనాలో ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది జిన్ పింగ్ ను గృహ నిర్బంధంలోకి నెట్టి వేశార‌ని. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ‌మైన రాజ‌కీయ ప్ర‌క్రియ ప్ర‌జాస్వామ్యం.

దానిని కాద‌నుకున్న నేత‌లు, అధ్య‌క్షులు, దేశాలు క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు జై శంక‌ర్(S Jai Shankar) . ఉగ్ర‌వాదం, హింసోన్మాదం కారణంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల్లో ర‌క్త‌పు మ‌ర‌క‌ల్ని చెర‌ప‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు.

ద‌శాబ్దాలుగా స‌రిహ‌ద్దు ఉగ్ర‌వాదాన్ని భ‌రిస్తూ భార‌త్ వ‌స్తోంద‌న్నారు. జీరో టాల‌రెన్స్ విధానాన్ని గ‌ట్టిగా స‌మ‌ర్థిస్తున్న‌ట్లు చెప్పారు జై శంక‌ర్.

Also Read : చైనా కింగ్ లి కియా మింగ్

Leave A Reply

Your Email Id will not be published!