Punjab Governor : సమసిన వివాదం గవర్నర్ ఆమోదం
ప్రత్యేక అసెంబ్లీ మీటింగ్ కు లైన్ క్లియర్
Punjab Governor : పంజాబ్ లో సీఎం భగవంత్ మాన్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య చోటు చేసుకున్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆప్ వర్సెస్ గవర్నర్ మధ్య మాటల యుద్దం కొనసాగింది.
అసలు పంజాబ్ రాష్ట్రానికి బాద్ షా నువ్వా నేనా అన్న రీతిలో నిప్పులు చెరిగారు సీఎం. తాను రాజ్యాంగం చదువుకున్నానని కానీ భగవంత్ మాన్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటే బావుండేదని సూచించారు గవర్నర్(Punjab Governor).
ఈ మేరకు రాజ్ భవన్ కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. దీనిపై పంజాబ్ ప్రభుత్వ సలహాదారు, ఎంపీ రాఘవ్ చద్దా గవర్నర్ పంజాబ్ రాష్ట్రానికి అధికారిక డొమైన్ మాత్రం కాదన్నారు.
ఈ తరుణంలో సెప్టెంబర్ 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్ ను గవర్నర్ పురోహిత్ కొట్టి పారేశారు. దీనిపై రాద్ధాంతం చెలరేగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మంత్రివర్గం కీలక భేటీ అయ్యింది.
సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలో సమావేశమై సాధారణ శాసనసభ సమావేశం నిర్వహించాలని తీర్మానం చేశారు. గవర్నర్ నామమాత్రమేనంటూ సంచలన కామెంట్స్ చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann).
ఈ నేపథ్యంలో బన్వరిలాల్ పురోహిత్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఆమోదించారు. ఈనెల 27న ఈ ప్రత్యేక సమావేశం కొనసాగనుంది.
మంగళవారం ఉదయం 11 గంటలకు మూడో సెషన్ కోసం అసెంబ్లీ సమావేశం ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ వెల్లడించారు. ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలాహలం