Aryadan Muhammed : కేర‌ళ మాజీ మంత్రి ఆర్య‌ద‌న్ క‌న్నుమూత‌

ఆర్య‌ద‌న్ మ‌హ‌మ్మ‌ద్ మృతిపై సంతాపం

Aryadan Muhammed : కేర‌ళ రాష్ట్ర రాజ‌కీయాల‌లో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా పేరొందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్య‌ద‌న్ మ‌హ‌మ్మ‌ద్ క‌న్నుమూశారు.

కేర‌ళ సీఎంలు ఈకే న‌య‌నార్, ఏకే ఆంటోనీ, ఉమెన్ చాందీల ప్ర‌భుత్వాల హ‌యాంలో ఆర్య‌ద‌న్ మ‌హ‌మ్మ‌ద్(Aryadan Muhammed)  అట‌వీ శాఖ మంత్రిగా, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

ఉత్త‌ర కేర‌ళ‌కు చెందిన ఆర్య‌ద‌న్ మ‌హ‌మ్మ‌ద్ సెక్యుల‌ర్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఆరు ద‌శాబ్దాల‌కు పైగా రాష్ట్ర రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

ఉత్త‌ర కేర‌ళ లోని కోజికోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ఆర్య‌ద‌న్ మ‌హ‌మ్మ‌ద్ ఆదివారం మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు.

ఆయ‌న వ‌య‌సు 87 సంవ‌త్స‌రాలు. ఇదిలా ఉండ‌గా ఆర్య‌ద‌న్(Aryadan Muhammed)  1935లో కేర‌ళ‌లో పుట్టారు. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు. ట్రేడ్ యూనియ‌న్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

1960లో కోజికోడ్ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ కార్య‌ద‌ర్శిగా ఎన్నిక‌య్యారు. 1969లో మ‌ల‌ప్పురం జిల్లా ఏర్పాటు అయ్యాక డీసీసీ మొద‌టి అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు ఆర్య‌ద‌న్ మ‌హ‌మ్మ‌ద్.

1977లో మ‌ల‌ప్పురంలోని నిలంబూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా గెలిచారు. వ‌రుస‌గా ఏడుసార్లు ఎమ్మెల్యే ప‌ద‌విని నిల‌బెట్టుకున్నారు.

1980లో న‌య‌నార్ లో అట‌వీ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. 1995లో ఆంటోనీ స‌ర్కార్ లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ఉన్నారు. 2011లో ఉమెన్ చాంది ప్ర‌భుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. రాహుల్ గాంధీ తో పాటు సీఎం విజ‌య‌న్ సంతాపం తెలిపారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో ఎన్నిక‌ల కోలాహ‌లం

Leave A Reply

Your Email Id will not be published!