PM Modi : చిరుతల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు – మోదీ
మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి
PM Modi : చిరుతల కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం మన్ కీ బాత్ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాన మంత్రి.
ప్రతి నెల నెలా రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది మోదీ పీఎంగా(PM Modi) కొలువు తీరిన తర్వాత కొనసాగుతూ వస్తోంది.
దేశానికి సంబంధించిన ఆ నెలలో చోటు చేసుకున్న ప్రధాన అంశాలతో పాటు కష్టపడి జీవితాన్ని జయించిన విజేతల గురించి కూడా ప్రస్తావిస్తారు నరేంద్ర మోదీ.
ఇవాళ జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమం 93వది కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన చిరుతలను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ప్రధాన మంత్రి.
దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులు అర్పించారు నరేంద్ర మోదీ(PM Modi). కొద్ది కాలం తర్వాత సాధారణ పౌరులు చిరుతలను చూసేందుకు వీలు కలుగుతుందన్నారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ లోతైన ఆలోచనా పరుడు. గొప్ప స్వాతంత్ర సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ ఎయిర్ పోర్టుకు షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
సంవత్సరాలుగా సంకేత భాషకు స్పష్టమైన ప్రమాణాలు లేవు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సంకేత భాష పరిశోధన, శిక్షణ కేంద్రం 2015లో ఏర్పాటు చేశామన్నారు.
అప్పటి నుంచి సంకేత భాష గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
Also Read : ఆర్థిక మంత్రి షాకింగ్ కామెంట్స్