Modi Bhagat Singh : చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు
ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
Modi Bhagat Singh : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన ప్రకటన చేశారు. భారత దేశ స్వాతంత్ర చరిత్రలో అరుదైన యోధుడిగా పేరు పొందారు సర్దార్ షహీద్ భగత్ సింగ్.
దేశ విముక్తి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు. స్ఫూర్తి దాయకమైన ధీరోదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాడని ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి.
ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన విప్లవ కారుడు. నా దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దమని ప్రకటించిన గొప్ప యోధుడు. రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్(Bhagat Singh) లు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదాన్ని షహీద్ తో ప్రారంభమైంది.
ఇదే సమయంలో ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న భగవంత్ మాన్ ప్రతి నిత్యం ఏదో ఒక సమయంలో సర్దార్ షహీద్ భగత్ సింగ్ పేరును తలుస్తూనే ఉంటారు.
కోట్లాది మంది భారతీయులు నేటికీ తమ ఆదర్శ ప్రాయమైన యోధుడిగా స్మరించుకుంటూనే ఉంటారు భగత్ సింగ్ ను. ఆదివారం మన్ కీ బాత్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీ(Modi Bhagat Singh).
ఈ మేరకు చండీగఢ్ విమానాశ్రయం (ఎయిర్ పోర్ట్ )కు సర్దార్ షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆయనకు ఈ సందర్భంగా అరుదైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు మోదీ.
స్వాతంత్ర సమర యోధులను స్మరించు కోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
Also Read : చిరుతల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు – మోదీ