Bhagwant Mann : మా ప్రయత్నం ఫలించింది – భగవంత్ మాన్
చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు
Bhagwant Mann : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు షహీద్ భగత్ సింగ్ పేరుగా మారుస్తున్నట్టు తెలిపారు.
మన్ కీ బాత్ 93వ కార్యక్రమం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విషయాన్ని వెల్లడించడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. తమ ప్రయత్నం ఫలితం ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.
ప్రధాన మంత్రి ప్రకటన చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు పంజాబ్ సీఎం. తన రాష్ట్ర ప్రభుత్వం, హర్యానా సంయుక్త ప్రయత్నాల గురించి కూడా ప్రస్తావించారు.
ఈ అంశం గురించి తాము విస్తృతంగా చర్చలు జరిపామన్నారు భగవంత్ మాన్(Bhagwant Mann). ఏకాభిప్రాయం వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 28న షహీద్ ఎ ఆజం భగత్ సింగ్ జయంతి .
ఆయనకు నివాళిగా ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు పెట్టాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశామని చెప్పారు. దానికి ముందు చండీగఢ్ ఎయిర్ పోర్టు పేరు మార్చాలని తాము కోరుతున్నామన్నారు.
మేం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రధానమంత్రి మోదీ మా మొరను ఆలకించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్(Bhagat Singh) కు అరుదైన నివాళులు అర్పించారంటూ పేర్కొన్నారు.
ఈ అంశంపై గత నెలలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. చండీగఢ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కి భగత్ సింగ్ పేరు పెట్టేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాని తెలిపారు.
Also Read : చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు