Covid19 : రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో దేశంలో 4,777 కేసులు నమోదు
Covid19 : దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా తీవ్రత ఎక్కువవుతోంది. 24 గంటల్లో 4,777 కొత్తగా కోవిడ్ కేసులు(Covid19) నమోదయ్యాయి. 43,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత కొంత కాలంగా అనూహ్యంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఉన్నట్టుండి పెరగడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది.
బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని ఈ మేరకు దేశ వ్యాప్తంగా టీకాలను అందుబాటులో ఉంచినట్లు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. తాజాగా కరోనా దెబ్బకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక కరోనా కారణంగా దేశంలో ఇప్పటి వరకు 5,28,510 మంది మరణించారు. కేరళలో 11 మంది చని పోయారు. ఆదివారం కరోనా కేసులకు సంబంధించి కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక వివరాలు వెల్లడించింది.
ఒక్క రోజులో కేసులు భారీ ఎత్తున నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,68,114కి పెరిగింది. కాగా క్రీయాశీల కేసులు 43,994కి తగ్గాయి.
మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.72 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 24 గంటల వ్యవధిలో 432 కేసులు తగ్గుముఖం పట్టాయి.
ఇక కేంద్రం తెలిపిన ప్రకారం రోజూ వారీ సానుకూలత రేటు 1.58 ఉండగా వారానికి అనుకూలత రేటు 1.63 శాతంగా ఉంది. కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,39,95,610కి చేరుకోగా కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
Also Read : సుయెల్లెకు క్వీన్ ఎలిజబెత్ -2 అవార్డు