President Draupadi Murmu : క‌ర్ణాట‌క‌లో రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న

రెండు రోజుల పాటు ముర్ము టూర్

President Draupadi Murmu :  భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రెండు రోజుల పాటు క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప్రెసిడెంట్ అధికారిక ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. సోమ‌వారం మైసూరు లోని చాముండి హిల్స్ లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ద‌స‌రా ఉత్స‌వాల‌ను ప్రారంభించ‌నున్నారు.

దేశంలో ప‌శ్చిమ బెంగాల్ , త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌తో పాటు క‌ర్ణాట‌క‌లో పెద్ద ఎత్తున ద‌స‌రా ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ప్ర‌ధానంగా మైసూరులో ప్ర‌తి ఏటా ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత ద్రౌప‌ది ముర్ము(President Draupadi Murmu) దేశానికి సంబంధించిన రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించే ద్రౌప‌ది ముర్ము రెండు రోజుల పాటు ఉంటారు.

ద‌స‌రా ఉత్స‌వాల‌ను ప్రారంభించిన అనంత‌రం హుబ్లీ లోని హుబ్లీ- ధార్వాడ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నిర్వ‌హించే పౌర స‌న్మాన కార్య‌క్ర‌మానికి ద్రౌప‌ది ముర్ము హాజ‌ర‌వుతారు. అంతే కాకుండా ధార్వాడ్ లోని ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ధార్వాడ్ కొత్త క్యాంప‌స్ ను కూడా ప్రారంభించ‌నున్నారు రాష్ట్ర‌ప‌తి.

సెప్టెంబ‌ర్ 27 మంగ‌ళ‌వారం బెంగ‌ళూరు లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ క్ర‌యోజెనిక్ ఇంజెన్ల త‌యారీని ద్రౌప‌ది ముర్ము ప్రారంభిస్తారు. సెయింట్ జోసెఫ్ విశ్వ విద్యాల‌యం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

అనంత‌రం బెంగ‌ళూరులో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము గౌర‌వార్థం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్వ‌హించే పౌర స‌న్మానానికి హాజ‌రు కానున్నారు. కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం సెప్టెంబ‌ర్ 28న తిరిగి ఢిల్లీకి బ‌య‌లు దేరుతారు.

Also Read : మ‌న్మోహ‌న్ సింగ్ కు బ‌ర్త్ డే గ్రీటింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!