Bilawal Bhutto : భారత్..పాక్ ల మధ్య బంధం అవసరం
పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి
Bilawal Bhutto : పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్ జర్దారీ భుట్టో(Bilawal Bhutto) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ను వరదలు ముంచెత్తాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా, పాకిస్తాన్ దేశాలు భారత దేశంతో బాధ్యతాయుతమైన సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పదే పదే ఆరోపణలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదన్నారు. ఫాగీ బాటమ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిలావల్ పాల్గొన్నారు. ఆంటోనీ బ్లింకెన్ తో సమావేశం అయ్యారు. అమెరికా , పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక సమస్యలపై సన్నిహితంగా పని చేస్తాయని ఇద్దరూ ప్రకటించారు.
పాక్ , అమెరికా బంధం దృఢంగా ఉండటమే కాకుండా కాల పరీక్షకు నిలిచిందన్నారు జర్దారీ. విధ్వంసకర వరదల ప్రభావం నుంచి పాకిస్తాన్ మరింత త్వరగా కోలుకునేలా భారత్ తో బంధం కొనసాగించాలని సూచించారు బ్లింకెన్. దీనికి ఓకే చెప్పారు బిలావల్ భుట్టో జర్దారీ(Bilawal Bhutto).
అనుకోకుండా ప్రకృతి విపత్తు కారణంగా పాకిస్తాన్ కు ఎనలేని నష్టం జరిఇంది. త్వరగా కోలుకోవాలంటే భారత్ తో పాటు అమెరికా, తదితర దేశాలు సహాయం చేయాలని కోరారు. రుణ మాఫీ, పునర్నిర్మాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలపై చైనాను నిమగ్నం చేయాలని తమ సహచరులను కోరడం జరిగిందని చెప్పారు జర్దారీ.
అమెరికా, పాకిస్తాన్ సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్, భారత్ దేశాలు కలిసి పని చేయాలని సూచించారు ఆంటోనీ బ్లింకెన్.
Also Read : జై శంకర్ కు గ్రాండ్ వెల్ కమ్