Congress President Poll : కాంగ్రెస్ చీఫ్ రేసులో గెహ్లాట్ లేనట్టే
మేడం అభిమానాన్ని కోల్పోయిన సీఎం
Congress President Poll : రాజస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చివరకు సీఎం అశోక్ గెహ్లీట్(Ashok Gehlot) పదవికి ఎసరు తెచ్చేలా చేసింది. మొదటి నుంచీ 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకస్తుడిగా, గాంధీ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉంటూ వచ్చారు అశోక్ గెహ్లాట్.
కానీ ఉన్నట్టుండి రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా సీన్ మారింది. రాజస్థాన్ లో రాజకీయం మరింత ఉత్కంఠను రేపుతోంది. ఒకరు ఒకే పదవి కలిగి ఉండాలని, జోడు పదవులు ఉండ కూడదని పార్టీ చింతన్ బైటక్ లో తీర్మానం చేసింది. ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు రాహుల్ గాంధీ.
దీంతో మొదటి నుంచి పార్టీ చీఫ్ ఎన్నిక(Congress President Poll) అక్టోబర్ 17న జరగనుంది. తమకు విధేయుడిగా ఉన్న అశోక్ గెహ్లాట్ ను నిలబెట్టాలని మేడం దాదాపు ఖరారు చేశారు. ఈ మేరకు ప్రకటించే సమయానికి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 90 మంది పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎంకు సపోర్ట్ గా నిలవడం, పరిశీకులను పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు మేడం సోనియా గాంధీ(Sonia Gandhi).
దీంతో అశోక్ గెహ్లాట్ ను పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో పార్టీకి చెందిన మరికొందరు నమ్మకస్తులైన సీనియర్ నాయకులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గెహ్లాట్ స్థానంలో కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్ కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి. దీంతో పార్టీ పరంగా అశోక్ గెహ్లాట్ కు సీఎం పదవి ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
Also Read : జై శంకర్ కు గ్రాండ్ వెల్ కమ్