Dipankar Dutta : సుప్రీం సీజేగా జస్టిస్ దీపాంకర్ దత్తా
దీపాంకర్ దత్తాను ఎస్సీకి సిఫారసు
Dipankar Dutta : సుప్రీంకోర్టు కొలిజియం సంచలన నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దీపాంకర్ దత్తా ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నారు. ప్రస్తుతం సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ కొనసాగుతున్నారు.
ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనున్నది. తర్వాతి సీజేఐగా లైన్ లో ఉన్నారు సీనియారిటీ పరంగా జస్టిస్ డీవై చంద్ర చూడ్. ఇటీవలే సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ పొందారు. కేవలం 74 రోజుల పాటు మాత్రమే ఉంటారు ప్రస్తుత భారత దేశ ప్రధాన న్యాయమూర్తి.
ప్రస్తుతం లలిత్ నేతృత్వంలోని కొలీజియం న్యాయమూర్తులు ధనంజయ వై చంద్రచూడ్ , సంజయ్ కిషన్ కౌల్ , ఎస్ఏ నజీర్ , కేఎం జోసెఫ్ లు ఉన్నారు.
మంజూరైన 34 మంది న్యాయమూర్తుల సంఖ్యతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో 5 ఖాళీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తీవ్రమైన చర్చల నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాను(Dipankar Dutta) అత్యున్నత న్యాయ స్థానానికి (సుప్రీంకోర్టు) న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది.
కోర్టుకు సంబంధించిన వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న తీర్మానం ప్రకారం కొలీజియం సమావేశంలో జస్టిస్ దత్తా పేరును ఖరారు చేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 23న పదవీ విరమణ చేసిన చివరి న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ.
గత వారం జరిగిన మూడు సమావేశాల్లో కొలీజియం సభ్యులు ఏకాభిప్రాయం కుదరక పోగా చివరకు జస్టిస్ దత్తా పేరును ఏక్రగీవంగా ఆమోదించింది.
Also Read : కొనసాగుతున్న దాడులు..అరెస్ట్ లు