Kamal Nath : కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేను – కమల్ నాథ్
మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్
Kamal Nath : నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేసులో ఉంటారని వచ్చిన ప్రచారాన్ని తిప్పి కొట్టారు మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్. అదంతా అబద్దమంటూ కొట్టి పారేశారు కమల్ నాథ్(Kamal Nath). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ఊహాగానాలను మాజీ సీఎం ఖండించారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు కృషి చేస్తారంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన తనకు లేదని కుండ బద్దలు కొట్టారు కమల్ నాథ్. దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రధానంగా పార్టీకి సంబంధించి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రెండోది అసమ్మతి కూటమికి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) పేర్లు. ఒకే వ్యక్తి ఒకే పదవి కలిగి ఉండాలన్న నియమం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ తరుణంలో గెహ్లాట్ ఉంటారో ఉండరోనన్న మరో ప్రచారం జోరందుకుంది. ఈ తరుణంలో ఆయనకు బదులు పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ కంటే మరికొందరి పేర్లను సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో కొత్తగా కమల్ నాథ్ , దిగ్విజయ్ సింగ్ , ముకుల్ వాస్నిక్ పేర్లు కొత్తగా తెర పైకి వచ్చాయి.
ఇదిలా ఉండగా అశోక్ గెహ్లాట్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా అన్న చందంగా మారింది. సీఎంగా ఉంటారా లేక పార్టీ పదవికి పోటీ చేస్తారో తేలనుంది.
Also Read : కొనసాగుతున్న దాడులు..అరెస్ట్ లు