AIADMK Removes : అన్నాడీఎంకే కోఆర్డినేటర్ తొలగింపు
AIADMK ప్రకటించిన మాజీ సీఎం పళనిస్వామి
AIADMK Removes : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నాయకుడు, పన్నీర్ సెల్వంకు సపోర్ట్ గా ఉన్నారంటూ పేరు తెచ్చుకున్న కోఆర్డినేటర్ పన్రుట్టి ఎస్ రామచంద్రన్ ను తొలగిస్తున్నట్లు(AIADMK Removes) ప్రకటించారు మాజీ సీఎం ఎడాపాడి పళనిస్వామి.
పార్టీని నమ్ముకుని ఎంతో కాలంగా పని చేస్తున్నారని కానీ ఇలా ఉన్నట్టుండి ఎందుకు వేటు వేశారంటూ మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మండిపడ్డారు. అయితే పార్టీకి తీరని నష్టం చేకూర్చారంటూ పేర్కొన్నారు పళనిస్వామి. కోర్టు తీర్పు మేరకు అన్నాడీఎంకేకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మాజీ సీఎం.
ఇదిలా ఉండగా తాత్కాలిక పార్టీ చీఫ్ పై రామచంద్రన్ కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం అన్నాడీఎంకే పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇందులో రామచంద్రన్ పార్టీకి సంబంధించి కార్యదర్శిగా ఉన్నారు.
కానీ గత కొంత కాలంగా ఆయన పార్టీ కోసం పని చేయడం లేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో మునిగి పోయారు. అందుకే రామచంద్రన్ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని అందుకే పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్లు తెలిపారు పళనిస్వామి.
పార్టీకి సంబంధించిన సూత్రాలు, నిబంధనలకు విరుద్దంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. మరో వైపు పన్నీర్ సెల్వం సహచరులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇదిలా ఉండగా పన్నీర్ సెల్వం మాత్రం పళని స్వామి తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
Also Read : కాంగ్రెస్ చీఫ్ రేసులో గెహ్లాట్ లేనట్టే