Delhi High Court : పరువు నష్టం కలిగించే పోస్టులు వద్దు
ఆమ్ ఆద్మీ పార్టీకి హైకోర్టు ఆదేశం
Delhi High Court : ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పై పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలించాలని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు కీలక సూచనలు చేసింది.
ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. ఆప్ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీకి చెందిన ఐదుగురు నాయకులు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కావాలని టార్గెట్ చేశారని, పరువుకు భంగం కలిగించేలా ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారంటూ కోర్టు అభిప్రాయపడింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, విమర్శలకు దిగడం మంచి పద్దతి కాదని సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సాల్ తో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిత్వాన్ని కించ పర్చేలా స్టేట్ మెంట్స్ , ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్ లు, రీ ట్వీట్లు చేశారంటూ ఆరోపించింది.
ఆప్ కి చెందిన నాయకులు అటిషి, సౌరభ్ భరద్వాజ్ , దుంగేష్ పాఠక్ , సంజయ్ సింగ్ , జాష్మిన్ షా లు లెఫ్టినెంట్ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పోస్టులు పెడుతున్నారంటూ అభిప్రాయపడింది. ఏదైనా ఉంటే నేరుగా తెలియ చేయాలని, లేదా రాత పూర్వకమైన ఫిర్యాదు ఉండాలని కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం మంచి పద్దతి కాదని పేర్కొంది కోర్టు.
వెంటనే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, పోస్ట్ లు తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఇది ఒక రకంగా ఆప్ సర్కార్ కు పెద్ద దెబ్బ.
Also Read : గూగుల్ పాలసీ హెడ్ అర్చన గులాటీ గుడ్ బై