Yarlagadda Laxmi Prasad : చంద్రబాబుపై యార్లగడ్డ కన్నెర్ర
భారతరత్న రాకుండా అడ్డుకున్నారు
Yarlagadda Laxmi Prasad : ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ పేరుతో మార్చేసింది జగన్ సర్కార్. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది.
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో(Nandamuri Balakrishna) పాటు పలువురు టీడీపీ మాజీ మంత్రులు, నేతలు భగ్గుమంంటున్నారు జగన్ రెడ్డిపై. దీనిని లైట్ గా తీసుకున్నారు సీఎం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరు మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.
దివంగత నాయకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు వెన్ను పోటు పొడిచింది ఎవరో తెలుగు వారందరికీ తెలుసన్నారు. ఆనాడు భారత రత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడేనంటూ బాంబు పేల్చారు. ఇందుకు తానే ప్రధాన సాక్ష్యమన్నారు యార్లగడ్డ.
పేరు మార్పుపై ఇంత రాద్దాంతం చేస్తున్న టీడీపీ శ్రేణులు ఆనాడు తమ పాలనలో గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎందుకు దివంగత నాయకుడు ఎన్టీఆర్ పేరు పెట్టలేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా వర్సిటీకి పేరు మార్పుపై లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు సొంత అభిప్రాయమని ఇందులో తాను జోక్యం చేసుకోనంటూ పేర్కొన్నారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్(Yarlagadda Laxmi Prasad).
తిన్నింటి వాసాలు లెక్క పెట్టే చంద్రబాబుకు ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇదిలా ఉండగా యూనివర్శిటీ పేరు మార్చిన రోజునే మూడు పదవులకు తాను రాజీనామా చేశానని చెప్పారు.
Also Read : పరువు నష్టం కలిగించే పోస్టులు వద్దు