Bhagwant Mann : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – మాన్
ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం
Bhagwant Mann : ప్రతిపక్ష పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. తీవ్ర ఉద్రిక్తతలు, నిరసనల మధ్య పంజాబ్ శాసనసభా ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్బంగా సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) ఆధ్వర్యంలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఏం సాధించారని, ఎందు కోసమని దీనిని ప్రవేశ పెట్టారో చెప్పాలంటూ ప్రతిపక్షాల నాయకులు నిలదీశారు. మాయ మాటలతో పవర్ లోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందంటూ మండిపడ్డారు. దీంతో శాసనసభ స్పీకర్ 15 మందిపై వేటు వేశారు.
ఆ ఎమ్మెల్యేలను సభ నుంచి వెళ్లి పోవాల్సిందిగా ఆదేశించారు. కదలక పోవడంతో మార్షల్స్ వారిని తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann) ప్రసంగించారు. తాము ఏం చెప్పామో అదే చేస్తున్నామని స్పష్టం చేశారు.
కానీ ప్రతిపక్షాలు కావాలని ఇబ్బందులు కలిగించేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అడుగడుగునా అటు ఢిల్లీలో ఇటు పంజాబ్ లో ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే పంజాబ్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస పార్టీలు ఒక్కటై పోయాయని సంచలన కామెంట్స్ చేశారు పంజాబ్ సీఎం. ఇకనైనా తమను విమర్శించడం మానుకుని సహకరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. దేశంలో ఇలాంటి అపవిత్ర పొత్తు ఇంకెక్కడా లేదని ఒక్క పంజాబ్ లో ఉందన్నారు.
Also Read : నిరసనల మధ్య మాన్ విశ్వాస తీర్మానం