Shanti Dhariwal : రాజస్థాన్ సంక్షోభంలో ‘శాంతి’ కలకలం
రాజస్థాన్ రాజకీయంలో అతడే కీలకం
Shanti Dhariwal : ఎవరీ శాంతి ధారివాల్ అనుకుంటున్నారా. మోస్ట్ పవర్ ఫుల్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్. అంతే కాదు అక్కడ నెంబర్ టూ అని కూడా అంటుంటారు. మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు అన్నీ తానే. ఆయన ఏం చెబితే ధారివాల్ చెప్పినట్లే. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం ముదిరి పాకాన పడింది.
90కి పైగా ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. వాళ్లు పార్టీ సీనియర్లను, హైకమాండ్ ను కూడా లెక్క చేయడం లేదు. తమ అగ్ర నాయకుడు, సీఎం అశోక్ గెహ్లాట్ కాకుండా ఇంకొకరిని నియమించాలని చూస్తే ఒప్పుకునేది లేదంటున్నారు. ఇప్పటికే సీనియర్లు అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గే జైపూర్ కు వచ్చారు.
వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇద్దరు సీనియర్లకు చేదు అనుభవం ఎదురైంది. దీని వెనుక సీఎం ఉన్నారని భావించారు. ఇదే విషయాన్ని మేడం సోనియాకు చేరవేశారు. ఆమె ప్రస్తుతం గుర్రుగా ఉంది. తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో గెహ్లాట్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
ఆపై మరో వైపు సీఎం పదవిని ఆశిస్తున్న మరో సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ వెనుక నుంచి పావులు కదుపుతున్నారు. గెహ్లాట్ గాంధీ ఫ్యామిలీకి వీర విధేయుడిగా పేరొంది. కానీ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో లేనట్టేనని పార్టీ వర్గాల పేర్కొంటున్నాయి.
ఈ మొత్తం ఎపిసోడ్ లో మంత్రిగా ఉన్నశాంతి ధారివాల్(Shanti Dhariwal) చేతిలోనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని పార్టీ హైకమాండ్ గుర్తించింది. మరి ఆయనకు నోటీసులు ఇస్తారా లేక సస్పెండ్ చేస్తారా అన్నది వేచి చూడాలి. ఇలా జరగాలంటే పార్టీలో దమ్ముండాలిగా.
Also Read : హైకమాండ్ తో టచ్ లో లేను – పైలట్