Sri Lanka President : యుఎన్ లో భారత్ కు శ్రీలంక మద్ధతు
సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత స్థానం
Sri Lanka President : ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు బేషరతుగా మద్దతు తెలిపింది భారత్. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసింది. ఇదే సమయంలో తమకు భారత్ సోదరుడంటూ భారత్ లో శ్రీలంక రాయబారి ఇప్పటికే ప్రకటించారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన రణిలె విక్రమసింఘే(Sri Lanka President) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భారత దేశానికి ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్ ) లో శాశ్వత స్థానం కల్పించేందుకు ఇప్పటికే పలు దేశాలు మద్దతు పలికాయి. అగ్ర రాజ్యం అమెరికా కూడా ఓకే చెప్పింది. తాజాగా శ్రీలంక ప్రభుత్వం భారత్ కు సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది.
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విక్రమ సింఘే అక్కడ ఉన్నారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఐదు శాశ్వత సభ్యులు, 10 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి.
ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య హోదా కోసం భారత్, జపాన్ లకు తమ ప్రభుత్వం బేషరతుగా మద్దతు ఇస్తుందని శ్రీలంక దేశ అధ్యక్షుడు రణిలె విక్రమసింఘె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా జపాన్ విదేశాంగ శాఖ మంత్రి యోషిమాసా హయాషితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ప్రెసిడెంట్. అంతర్జాతీయ వేదికపై జపాన్ తమ శ్రీలంక దేశానికి అందించిన సహకారం, మద్దతు మరిచి పోలేమన్నారు విక్రమసింఘె.
గత కొన్నేళ్లుగా యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తోంది భారత దేశం. ఐక్య రాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి.
Also Read : ఎట్టకేలకు బయటకు వచ్చిన జిన్ పింగ్