CBI Arrests : రూ. 565 కోట్ల చిట్ ఫంట్ కేసులో అరెస్ట్
నలుగురిని అదుపులోకి తీసుకున్న సీబీఐ
CBI Arrests : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన రూ. 565 కోట్ల చిట్ ఫండ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన నలుగురిని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్(CBI Arrests) చేసింది. ఒడిశాలో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టింది.
అంతే కాకుండా తమ చిట్ ఫండ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడిని ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. విచిత్రం ఏమిటంటే సదరు చిట్ ఫండ్ సంస్థ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 565 కోట్లను సమీకరించింది. ప్రజల డబ్బులను అప్పనంగా కొల్లగొట్టింది.
అక్రమంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే డిపాజిట్లను అక్రమంగా సేకరించారని, మెచ్యూరిటీ మొత్తాన్ని తిరిగి చెల్లించ లేదని ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అరెస్ట్ చేసిన నలుగురూ పోంజీ పథకంతో సంబంధం కలిగి ఉన్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.
ఇదిలా ఉండగా చిట్ ఫండ్ కేసులో కోల్ కతా లోని కంపెనీల మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్(CBI Arrests) చేసినట్లు సీబీఐ వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో ఒక వ్యవస్థాపక డైరెక్టర్ , ఇద్దరు ప్రైవేట్ కంపెనీల టెరిటరీ మేనేజర్లు ఉన్నారని అధికారికంగా ప్రకటించింది.
2014లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పటి ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని తెలిపింది సీబీఐ. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో నమోదైన వ్యవహారంపై విచారణ చేపట్టామని ఏజెన్సీ పేర్కొంది.
Also Read : నోట్ల రద్దుపై 12న సుప్రీం విచారణ