Modi Bhagat Singh : విప్లవ యోధుడికి వినమ్ర నివాళి – మోదీ
భగత్ సింగ్ జీవితం స్పూర్తి దాయకం
Modi Bhagat Singh : దేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను చిరునవ్వుతో ముద్దాడిన యోధుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్ 115వ జయంతి ఇవాళ. సెప్టెంబర్ 27 జయంతిని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖులు నివాళులు అర్పించారు. తాజాగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
విప్లవ యోధుడికి వినమ్రంగా తాను నివాళులు అర్పిస్తున్నానని పేర్కన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ దేశంలోని 135 కోట్ల ప్రజల్లో చిరస్థాయిగా భగత్ సింగ్ నిలిచి పోయారని పేర్కొన్నారు. దేశం పట్ల ప్రేమ, నిబద్దత, త్యాగ నిరత ఎల్లప్పటికీ గుర్తుంచుకునేవిగా ఉంటాయని ప్రశంసించారు మోదీ.
స్వాతంత్ర సమర యోధుడి సాహసోపేత త్యాగం అసంఖ్యాక ప్రజలలో దేశ భక్తిని రగిల్చిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన ఉదాత్తమైన ఆదర్శాల కోసం కట్టుబడి ఉన్న గొప్ప యోధుడిగా పేర్కొన్నారు. ఆ విప్లవ యోధుడికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఫైసలాబాద్ జిల్లా లోని బంగా గ్రామంలో పుట్టాడు భగత్ సింగ్. అత్యంత ఆకర్షణీయమైన భారతీయ సోషలిస్టు విప్లవకారుడు. స్వాతంత్ర ఉద్యమంలో విరోచిత చర్యలు, త్యాగాలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతాయని ప్రశంసించారు ప్రధానమంత్రి(Modi Bhagat Singh).
మార్చి 23, 1931లో భగత్ సింగ్ తో పాటు సుఖ్ దేవ్ , రాజ్ గురులను ఉరి తీశారు ఆంగ్లేయులు. ఇదిలా ఉండగా భగత్ సింగ్ ను ఉరి తీసిన సమయంలో ఆయన వయస్సు కేవలం 23 ఏళ్లు మాత్రమే.
భగత్ సింగ్ కు పంజాబ్, ఢిల్లీ సీఎంలు భగవంత్ మాన్ , కేజ్రీవాల్ నివాళులు అర్పించారు.
Also Read : అంకితా ఫ్యామిలీకి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా