PFI Accounts Block : పీఎఫ్ఐ సోష‌ల్ మీడియా ఖాతాలు బ్లాక్

వెబ్ సైట్ లు..యూట్యూబ్ ఛాన‌ళ్లు క్లోజ్

PFI Accounts Block : దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ విధ్వంసాల‌కు ప్లాన్ చేస్తూ ఉగ్ర‌వాదులుగా త‌యారు చేస్త‌న్న పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పాటు దాని అనుబంధ సంస్థ‌ల‌పై కేంద్రం వేటు వేసింది. ఇప్ప‌టికే ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.

ఇందుకు సంబంధించి బుధ‌వారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పీఎఫ్ఐకి చెందిన వెబ్ సైట్ లు, సోష‌ల్ మీడియా ఖాతాలను తొలగించాల‌ని ఉత్త‌ర్వులలో పేర్కొంది.

తొల‌గింపు ఆర్డ‌ర్ లో భాగంగా అధికారిక సైట్ లు, ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ , లింక్డ్ ఇన్, వాట్సాప్ , టెలిగ్రామ్ తో పాటు యూట్యూబ్ ఛానెళ్లు వెంట‌నే బ్లాక్ చేయాల‌ని ఆదేశించింది.

ఇత‌ర ఆన్ లైన్ లో పీఎఫ్ఐకి చెందినవి ఎవైనా ఉంటే వాటిని కూడా తొల‌గించాల‌ని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా ఐదేళ్ల పాటు నిషేధం విధించిన స‌మ‌యంలో పీఎఫ్ఐ, ఆర్ఐఎఫ్‌, ఏఐఐసీల‌కు చెందిన సైట్స్ ను , సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్(PFI Accounts Block) చేసింది.

మ‌రికొన్ని కేంద్ర ఏజెన్సీల సూచ‌న‌ల ఆధారంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ ఆదేశాల మేర‌కు ప్రాసెస్ లో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. కాగా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమిది సంస్థ‌ల‌ను పూర్తిగా నిషేధం విధేంచింది.

కొన్ని గంట‌ల త‌ర్వాత ఆయా సంస్థ‌ల‌కు చెందిన సామాజిక మాధ్య‌మాల‌న్నీంటిని బంద్ చేసింది. దీనికి సంబంధించి స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేసింది కేంద్ర మంత్రిత్వ శాఖ‌.

నిషేధానికి గురైన వాటిలో పీఎఫ్ఐ, ఎస్డీపీఐ, ఆర్ఐఎఫ్‌, సీఎఫ్ఐ, ఏఐఐసీ, ఎన్సీహెచ్ఆర్ఓ త‌దిత‌ర సంస్థ‌లు ఉన్నాయి.

Also Read : ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ కు దేశం స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!